ఉద్యోగాలిప్పిస్తామని మోసం

Sat,January 12, 2019 06:50 AM

men cheated people by assuring job offering in hyderabad

హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సైబర్‌ చీటర్లను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు వేరు వేరు ఘటనల్లో అరెస్ట్ చేశారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్, లక్నోకు చెందిన మోహిత్ గుప్తా, మాదవ్ జైషీలు ఉద్యోగాల కోసం ఇంటర్‌నెట్‌లో ప్రయత్నాలు చేసేవారి మొబైల్ నంబర్లు, ఈ మెయిల్స్ అడ్రస్‌లు సేకరించి ఫోన్లు చేశారు.

తాము ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా... ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన బాధితుడికి సన్ ఫార్మసూటికల్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి దఫ దఫాలు మొత్తం రూ. 8.02 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ భద్రమ్‌రాజ్ రమేశ్ బృందం యూపీకి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించారు.

మరో ఘటనలో...
న్యూఢిల్లీ, బుద్ధానగర్‌కు చెందిన ప్రవీందర్‌కుమార్ ఝా అలియాస్ రవి కాల్‌సెంటర్ ఉద్యోగి. లంగర్‌హౌస్‌కు చెందిన బాధితుడికి అరబిందో ఫార్మసీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 2.18 లక్షలు దఫ దఫాలుగా కాజేసి, సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడ అరెస్ట్ చేసి, నగరానికి తరలించారు.

1589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles