తక్కువ ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులంటూ మోసం

Sun,February 3, 2019 11:24 AM

man who cheated people with electronic products arrested by cyber crime police

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న వెస్ట్ సౌత్ ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వివిధ సంస్థలకు చెందిన మ్యాట్రీమోనీ సైట్లలో డాక్టర్లు, ఇంజినీర్లు, పైలెట్లుగా తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసి యువతులను ఆకర్షించడంతో పాటు వారికి విలువైన బహుమతులను పంపిస్తున్నామని నమ్మించి, ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ బాధితుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేస్తుంటారు.

డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. కొటే డీ ఐవోరీ (సౌత్ ఆఫ్రికా) దేశానికి చెందిన టోరి ఇంజా లమిన్, అకా డనియల్‌లు ఢిల్లీ వికాస్‌పురిలో నివాసముంటున్నారు. బెస్ట్ బై సేల్స్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, అందులో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామం టూ నమ్మిస్తారు. తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆన్‌లైన్‌లో ఎవరైన వాటిని కొనుగోలు చేస్తే వెంటనే నకిలీ ఇన్‌వైస్ కాపీని పంపించి నమ్మకం కలిగిస్తారు. అనంతరం కొరియర్ బాయ్‌తో బుక్ చేసిన వస్తువులను ఇంటికి పంపిస్తున్నామంటూ సమాచారం ఇస్తూ, నకిలీ కొరియర్ రశీద్‌ను కూడా పంపిస్తారు. ఆ తరువాత కొరియర్ తీసుకొని వస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ నాటకానికి తెరలేపి, ఆ వస్తువులు బుక్ చేసుకున్న వారి వద్ద అందిన కాడికి దోచేస్తారు. ఇలా హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితుడు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తక్కువ ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులను బుక్ చేశాడు. దీంతో సైబర్ చీటర్లు అతన్ని నమ్మించి రూ. 8 లక్షలు కాజేశారు. మోసపోయిన బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమో దు చేసుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles