మద్యానికి డబ్బులివ్వలేదని .... కత్తితో భార్యను పొడిచాడు

Tue,September 11, 2018 06:30 AM

man stabbed his wife with a Scissor

అల్వాల్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆమె గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై వరప్రసాద్ కథనం ప్రకారం... అల్వాల్ సర్కిల్, సూర్యనగర్‌లో చంద్రశేఖర్, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. లక్ష్మి ఇంట్లోనే కిరాణ దుకాణం, టైలర్ షాపు నిర్వహిస్తుంది. కాగా... చంద్రశేఖర్ ఉద్యోగం లేకుండా... మద్యానికి బానిసైయ్యాడు.

ఈ క్రమంలో రోజూ మద్యానికి డబ్బుల కోసం భార్యతో గొడవపడుతుండేవాడు. సోమవారం కూడా ఈ విషయంలో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపానికి గురైన చంద్రశేఖర్.... మిషన్‌పై ఉన్న కత్తెరతో భార్య కడుపులో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి చంద్రశేఖర్ పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

3199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles