పనిచేస్తున్న ఇంట్లో రూ. 35లక్షల సొత్తు కాజేసింది...

Thu,May 16, 2019 09:31 AM

Maid servant held for theft of Rs 35 Lakhs gold

హైదరాబాద్ : పనిచేస్తున్న ఇంట్లో రూ.35 లక్షల విలువైన ఆభరణాలు, నగదును తస్కరించిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వర్షిణి సంజయ్‌గాంధీ(47) అనే మహిళ ఏడాది కిందట నగరానికి వచ్చి శ్రీనగర్‌కాలనీలోని అంబియెన్స్ ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ప్రైవేటు ఉద్యోగి కౌశిక్ సారంగి ఇంట్లో పనిమనిషిగా చేరింది. యజమాని కుమార్తెను చూసుకోవడంతో పాటు వంటపని చేస్తూ నమ్మకాన్ని చూరగొంది. కాగా కొద్ది నెలలుగా యజమానికి చెందిన బెడ్‌రూమ్‌లోని లాకర్లలో దాచుకున్న నగలను ఎవరూ లేని సమయంలో తస్కరిస్తున్నది. ఈ నెల 12న ఈ విషయాన్ని గుర్తించిన కౌశిక్ ఇంట్లోని లాకర్లను పరిశీలించగా వజ్రపు ఉంగరాలు, వజ్రాలు పొదిగిన బంగారం గాజుల జత, బంగారు గొలుసులు, చెవిరింగులతో పాటు రూ.1లక్షా50వేల నగదు చోరీకి గురయినట్లు తేలింది.

వర్షినీగాంధీని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని బుకాయించింది. మరుసటిరోజు ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకుని పరారయ్యింది. ఈ మేరకు ఈ నెల 13న బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం ఆభరణాలతో పాటు సొత్తు విలువ రూ.35 లక్షల మేర ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితురాలు వర్షినీగాంధీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. అమెవద్దనుంచి రూ.30 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ రోజు రిమాండ్‌కు తరలించారు.

2874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles