మధులికను 15 రోజులు కంటికిరెప్పలా కాపాడాం..!

Wed,February 20, 2019 03:37 PM

Madhulika   discharged from hospital after complete recovery

హైదరాబాద్‌: ప్రేమోన్మాది దాడిలో గాయపడి కోలుకున్న మధులికను మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు ఇవాళ డిశ్చార్జ్‌ చేశారు. మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. మధులిక పూర్తిగా కోలుకుంది. రెండు వారాల క్రితం తీవ్రగాయాలపాలైన మధులికను 15 రోజుల పాటు కంటికిరెప్పలా కాపాడాం. ఆమె ఆహారం తీసుకుంటోంది. మాట్లాడగలుగుతోంది. ఫిజియోథెరపికి సంబంధించి పలు సూచనలు చేశాం. సరైన పోషకాహారం అందకుంటే మళ్లీ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆమె తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పామని వైద్యులు వివరించారు.

2332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles