తక్కువ ధరకు ఐఫోన్‌లంటూ గాలం..

Fri,December 28, 2018 07:24 AM

low price for iphone fraud in hyderabad

హైదరాబాద్ : ఫేస్‌బుక్ పరిచయంతో ఐదు వేల ఫోన్‌కు రూ.1.43 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ మోసానికి పాల్పడ్డ నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ ప్రాంతానికి చెం దిన బండి నరేశ్‌కు ఫేస్‌బుక్‌లో వికాస్ పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో రూ.5 వేలు చెల్లిస్తే సెకండ్ సేల్స్‌కు సంబంధించిన ఖరీదైన ఫోన్ ఇస్తానని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన నరేశ్ రూ.5 వేలు చెల్లించాడు. వెంటనే వికాస్ ఓ వాట్సాప్ మెసేజ్‌లో 24 గం టల్లో నీకు ఐఫోన్ లండన్ నుంచి డెలివరీ అవుతుందని చెప్పాడు. అంతేకాకుండా ఓ ట్రాకింగ్ ఐడీని కూడా ఇచ్చాడు. రెండు రోజులపాటు వేచి చూసినా ఫోన్ రాకపోవడంతో వికాస్‌ను ఫోన్‌లో నిలదీశాడు. దీంతో ఫోన్ రాలేదనే విషయాన్ని మెయిల్ చేయమన్నాడు. నరేశ్ మెయిల్ చేయగానే తిరిగి అతనికి మెయిల్ వచ్చింది.

అందులో 18 ఐ-ఫోన్‌లను పార్సిల్‌లో పంపామని సమాధానం ఇచ్చారు. డెలివరీ చార్జీల కింద రూ.12,500, ఇన్సూరెన్స్ కింద రూ.22,500చెల్లించాలనడంతో అన్నీ ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఇంకా కస్టమ్స్, జీఎస్టీ, ఎయిర్‌పోర్టు క్లియరెన్స్, ఇతర అంశాలపై మొత్తం రూ.1.43 లక్షలను వసూలు చేశారు. చివరకు మరో రూ.20వేలు కావాలని ఫోన్ చేయడంతో అనుమానం వచ్చిన నరేశ్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ జలందర్‌రెడ్డి బృందం నరేశ్‌కు పరిచయమైన వికాస్ అసలు పేరు నిలేశ్‌కుమార్ ముంబైకి చెందిన వాడిగా గుర్తించి అరెస్టు చేశారు. నీలేశ్‌కుమార్ నుంచి 3 స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలకు ప్రజలు దూరంగా ఉండాలని క్రైం పోలీసులు సూచించారు.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles