ఎక్కువసేపు కూర్చుంటే..!

Tue,October 8, 2019 09:44 PM

గంటల తరబడి ఒకచోటే కదలకుండా అలాగే కూర్చోవడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. రోడ్ల మీద తిరిగిచేసే ఫీల్డ్‌వర్క్ కన్నా రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేసుకునే ఉద్యోగం ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇలా ఎక్కువ గంటలు కుర్చీలో కూర్చునేవారి జ్ఞాపకశక్తి తగ్గిపోతుందంటున్నారు అమెరికా పరిశోధకులు. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారు డయాబెటిస్, గుండెపోట్ల వంటి సమస్యల బారినపడటమే కాదు.. వాళ్లకి మతిమరుపు కూడా వస్తుందంటున్నారు. రోజంతా కూర్చునే ఉండటం వల్ల మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన విభాగం దెబ్బతింటుందని ఈ పరిశోధనల్లో తేలింది.ఎప్పుడూ కూర్చుని ఉండేవాళ్ల మెదడు మీడియల్ టెంపోరల్ లోబ్ (ఎంఆర్‌ఎల్) పొర పలుచబడుతున్నట్టు ఇలాంటివాళ్లకు చేసిన ఎంఆర్‌ఐ పరీక్షల్లో నిర్ధారణ అయింది. మీడియల్ టెంపోరల్ లోబ్ పొర దెబ్బతినటం వల్ల మతిమరుపు ఎక్కువై డిమెన్షియా వ్యాధికి దారితీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధ్యయనకారులు. ఒకసారి ఎంటీఎల్ పొర దెబ్బతిన్న తర్వాత వ్యాయామం చేసినప్పటికీ ఇది తిరిగి బాగుపడటం లేదు. దీన్ని నిర్లక్ష్యంచేస్తే ఇది అల్జీమర్స్ వ్యాధి రావటానికి కూడా కారణమవుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తగినంత వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు కూర్చోకుండా గంటకోసారి లేచి ఐదుపదినిమిషాలు అటూ ఇటూ నడవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.

4572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles