హెచ్‌సీయూలో చిరుత కలకలం

Sat,January 12, 2019 06:08 AM

Leopard wandering tension in hcu hyderabad

హైదరాబాద్: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో చిరుత కనిపించిందన్న వార్త కలకలం సృష్టించింది. విధుల్లో ఉన్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డు చిరుత కనిపించిందని అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతోపాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వర్సిటీకి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం క్యాంపస్ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలించారు. ఎటువంటి ఆచూకీ లభించకపోవడం.. చిరుత సంచరించిన ఆనవాళ్లు, పాదముద్రలు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా కొన్ని రోజులు సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఈ మేరకు వర్సిటీ అధికారులకు సూచించారు.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles