ఫంక్షన్ ఉంటే ఆట బంద్..!

Fri,April 26, 2019 10:46 AM

lalbahadur playground in raheempura converted to function hall

- ఫంక్షన్‌హాల్‌గా మారిన రహీంపురాలోని లాల్‌బహదూర్ ఆట స్థలం
- వేసవి కాలంలో సెలవులున్నా ఆడుకోవడానికి స్థలం లేక విద్యార్థుల ఇబ్బందులు

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం మంగళ్‌హాట్ డివిజన్ పరిధిలోని రహీంపురాలోని లాల్‌బహదూర్ ఆట స్థలంలో తరచుగా ఫంక్షన్‌లు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి వీలు లేకుండా పోతున్నది. వేసవి కాలంలో ఆటలు ఆడుకోవడానికి పరిసర ప్రాంతాలలో ఉన్నదే ఒకే ఒక్క ఆట స్థలం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం ఆ స్థలంలోనే తరచు వివాహాది, శుభకార్యాలను నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు సాధన చేసేందుకు వీలు పడడం లేదు. జియాగూడ, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, రహీంపురా తదితర ప్రాంతాల వారికి ఒకే ఒకటి రహీంపురా లాల్ బహదూర్ ఆటస్థలం. ఇందులో కూడా ఫంక్షన్లు జరుగుతుండడంతో క్రీడాకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థలం ఉన్నా..


రహీంపురాలోని లాల్‌బహదూర్ ఆట స్థలంలో ఫంక్షన్లు ఉంటే మూడు రోజుల పాటు ఆటలు నిలిచి పోతాయి. ఫంక్షన్‌కు కావాల్సిన సామాగ్రిని పెట్టడం, ఫంక్షన్ నిర్వహించడంతో క్రీడాకారులు ఆటలు ఆడుకోవడానికి వీలు లేకుండా పోతున్నది. వేసవి కాలంలో సెలవులు ఉన్నా కూడా ఆడుకుందామని ప్రయత్నించే విద్యార్థులకు ఆట స్థలంలో ఖాళీ స్థలం లేక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆట స్థలంలో దావత్‌లను నిషేధించాలి..


ఆటస్థలంలో దావత్‌లను పూర్తిగా నిషేధించాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఈ ఆట స్థలంలో క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, సర్కిల్ కత్తి యుద్ధం, యోగా, కరాటే, బాక్సింగ్ లాంటి ఎన్నో ఆటలు వేసవిలో నేర్చుకోవడానికి చిన్నారులు, క్రీడాకారులు ఎంతో మక్కువతో ఆట స్థలానికి ప్రతిరోజూ వస్తుంటారు. దావత్‌ల కారణంగా ఆట స్థలానికి వచ్చి నిరాశతో వెనుతిరుగుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే వేసవి శిక్షణ శిబిరాలకు ఆట స్థలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సి ఉంది. మేలో ప్రారంభమయ్యే వేసవి శిక్షణా శిబిరాలకు అన్ని హంగులతో ఆట స్థలాన్ని తీర్చిదిద్దడంతో పాటు తగిన ఆటల సామాగ్రిని, కోచర్లను నియమించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

1408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles