నోట్లే అక్షింతలు.. వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో

Wed,March 20, 2019 05:52 PM

మీరు ఎవరి పెళ్లికైనా వెళ్లారనుకోండి. ఏం చేస్తారు. పెళ్లయ్యాక నూతన వధూవరులను ఆశీర్వదించి వాళ్ల నెత్తి మీద అక్షింతలు చల్లి.. ఇస్తే గిస్తే ఓ గిఫ్ట్ ఇచ్చి.. పెళ్లి శుభాకాంక్షలు చెప్పి భోంచేసి ఇంటిదారి పడతారు. అంతే కదా. కానీ.. ఈ అతిథి మాత్రం చాలా ఖరీదైన అతిథి. వధూవరులకు మామూలు అక్షింతలు వేస్తే ఎలా? మన పరువేం కాను అనుకున్నాడో ఏమో. ఏకంగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించాడు.


ఓ బుట్టలో కరెన్సీ నోట్లను తీసుకొచ్చి అక్షింతలు వేసినట్లుగా వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద చల్లాడు ఆ అతిథి. అతడు కరెన్సీ నోట్లను వాళ్ల మీద చల్లడమే ఆలస్యం మరో వ్యక్తి వచ్చి వాటిని కవర్‌లో వేయడం ప్రారంభించాడు. ఆ అతిథి వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించడం చూసి పెళ్లికి వచ్చిన మిగితా అతిథులు మాత్రం నోరెళ్లబెట్టారట. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగినట్లు.. ల‌క్ష‌ల‌ రూపాయలను కొత్త జంట మీద వెదజల్లినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా టైమ్స్ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

3944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles