వైఎస్ జగన్‌తో భేటీ కానున్న కేటీఆర్

Wed,January 16, 2019 07:18 AM

KTR to hold talks with Jagan on Wednesday

హైదరాబాద్: జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసివచ్చే విషయంపై వైఎస్సార్‌సీపీతో చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జగన్‌తో పలు కీలక అంశాలపై కేటీఆర్ బృందం చర్చించనుంది.

3183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles