'మల్లేశం' సినిమా వెనుకాల ఉన్న అజ్ఞాత సూర్యులందరికీ అభినందనలు: కేటీఆర్

Sat,June 15, 2019 09:04 PM

ktr praised mallesham movie team after watching movie in ramanaidu preview theatre

హైదరాబాద్: రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో మల్లేశం సినిమాను ఇవాళ ప్రదర్శించారు. సినిమా ముందస్తు ప్రదర్శనను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఈసందర్భంగా మల్లేశం సినిమా బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మల్లేశం సినిమా వెనుకాల ఉన్న అజ్ఞాత సూర్యులందరికీ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఎన్నో మానవ ఉద్వేగాలను క్యాప్చర్ చేసి ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నందుకు కేటీఆర్ అభినందించారు.

ఒక సామాన్యుడు ప్రతిభా పాఠవాలు చూపే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే అంశాలు బాగా చూపించారు. ఎన్నో సన్నివేశాలు నన్ను ఆకట్టుకున్నాయి. మరుగున పడిపోతున్న కళగా, మరిచిపోతున్న కళగా చేనేత రంగంలోకి కష్టనష్టాలను ఆవిష్కరించారని కేటీఆర్ తెలిపారు.


భారీ యూనిట్ ఏర్పాటు కోసం చింతకింది మల్లేశానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు సాయం చేసింది. చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం 1270 కోట్ల రూపాయలు కేటాయిస్తే గత ప్రభుత్వాలు కేవలం 70 కోట్ల రూపాయలే కేటాయించాయి. చేనేత రంగానికి ఇన్ని రెట్ల నిధులు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. తల్లి కష్టాన్ని చూసి బాధపడి, భాష, విషయం మీద పట్టు లేకపోయినా ఎంతో కష్టపడి ఎంతో మంది తల్లుల కష్టాన్ని మల్లేశం దూరం చేశాడు. విజయవంతం అవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదని చూపించింది ఈ సినిమా. ప్రియదర్శి చాలా బాగా నటించాడు. రచయిత పెద్దింటి అశోక్ డైలాగ్‌లు చాలా బాగా రాశాడు. ప్రభుత్వం తరుపున మల్లేశం సినిమాకు ట్యాక్స్ లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. చేనేత కళాకారులకు అండగా ఉండేందుకు చేనేత వస్ర్తాలకు మార్కెటింగ్ జరగాలి. నాతో పాటు కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిస్తున్నారు. సహజత్వానికి సినిమా ఎంతో దగ్గరగా ఉంది అని కేటీఆర్ అన్నారు.

2654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles