కేటీఆర్‌కే బహుమతిగా.. కేటీఆర్ చిత్రపటం!

Fri,October 12, 2018 06:44 PM

ktr painting bought by mahesh bigala

హైదరాబాద్: రమావత్ సువర్ణ(22).. దివ్యాంగురాలైన ఆమె తన కళానైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. కనీసం తనంతట తాను తినడానికి కూడా వీల్లేని స్థితిలో ఉన్న ఆమె గీసిన చిత్రాలు చెప్పడం కాదు చూసి పరవశించిపోవాల్సిందే. తాజాగా గీసిన మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చిత్ర‌ప‌టానికి వేలంలో మంచి ధర వచ్చింది.

చేతిని పూర్తిస్థాయిలో కదిలించలేని సువర్ణ 16ఏళ్లుగా ఫ్లోరోసిస్‌తో పోరాడుతూ చిత్రలేఖనంపై మక్కువతో వేసిన చిత్రాలను ఎన్నారై జలగం సుధీర్, బ్రాండ్ తెలంగాణ(తెలంగాణ హస్త, చేనేత, ఇతర కళాకారులకు చేయూత అందించే ఫేస్‌బుక్ పేజీ) నిర్వాహకులు ఏర్పాటు చేసిన పేజీలో పోస్ట్ చేస్తూ వాటిని ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సువర్ణ వేసిన చిత్రాలను వేలం వేయగా మంత్రి కేటీఆర్ చిత్రాన్ని టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సువర్ణకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ51వేలకు చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన మ‌హేశ్‌ చిత్రపటాన్ని ఆయ‌న‌కు బ‌హుమ‌తిగా అంద‌జేశారు.

2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles