చంద్రబాబు కలలో కూడా కేసీఆర్‌ను కలవరిస్తున్నారు..!

Sat,February 23, 2019 04:07 PM

KTR Chit Chat With Media

హైదరాబాద్‌: శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మాకు 5 స్థానాలు గెలిచే సంఖ్యాబలం ఉందని కేటీఆర్‌ చెప్పారు. శనివారం కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్లమెంట్‌ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో షెడ్యూల్‌ ప్రకటిస్తాం. 16 స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతాం. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి తగిన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని డిమాండ్‌.. కమాండ్‌ చేయవచ్చు అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని కేటీఆర్‌ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాదని ఎవరైనా చెబుతారు. చంద్రబాబు వందశాతం ఓడిపోతారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలు మంచివి కావు. రెండు దర్యాప్తు సంస్థల మధ్య విభేదాలు సరైంది కాదు. పుల్వామా ఘటనను రాజకీయంగా వాడుకుంటే ప్రజలు తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసించాలనే నినాదంతో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రాహుల్‌ వర్సెస్‌ మోదీ వాతావరణం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుస్తదని అనిపిస్తోంది.

చంద్రబాబు కలలో కూడా సీఎం కేసీఆర్‌ను కలవరిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఒడిపోవడం ఖాయం. ఢిల్లీలో కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేడు.

దేశంలో అన్ని రాష్ర్టాల్లో ఐటి దాడులు జరుగుతాయి.. ఒక్క చంద్రబాబుకే ఉలిక్కిపాటు ఎందుకు. చంద్రబాబు లాగా మేం ఖాళీగా లేము.. మాకు చాలా పని ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ నైరాశ్యంలో ఉంది. ఇప్పట్లో కోలుకోలేదు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలివైన వాళ్లు. కేంద్రం అన్యాయం చేసింది అనేది చంద్రబాబే.. మేమే నంబర్‌వన్‌ అనేది కూడా ఆయనే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

3122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles