ఈ సారీ మహాగణపతిదే తొలి నిమజ్జనం.. ఏర్పాట్లు షురూ

Tue,September 10, 2019 06:37 AM

khairatabad ganesh immersion is first this time also

హైదరాబాద్: భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి షెడ్యూల్ సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ గణేషుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు. అప్పటి వరకు ఇతర విగ్రహాల నిమజ్జనాలను నిలిపివేస్తారు. నిర్ణీత సమయం ఉదయం 11.30 గంటలకు సాగరంలో స్వామి వారిని నిమజ్జనం చేస్తారు. 61 అడుగుల ఎత్తులో....27 అడుగుల వెడల్పులో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి విగ్రహం 45 టన్నులకు పైగా బరువు ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ విగ్రహాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు పోలీసు యంత్రాంగం సూచనల మేరకు ముందుస్తుగా ఏర్పాట్ల చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి మాత్రం గణేషుడి వద్ద ఉన్న స్వాగత తోరణాలను తొలగిస్తారు. కాగా మంగళవారం అర్థరాత్రి నుంచి నిమజ్జన ఏర్పాట్లును ప్రారంభిస్తారు . గత దశాబ్ద కాలంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం. 4 వద్దే నిమజ్జనం చేస్తున్నారు.

అయితే ఈ ఏడాది ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేయాలని సంకల్పించింది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు నిమజ్జనం చేసే స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు డ్రోన్‌లతో సాగర్‌లో లోతు ఉన్న ప్రాంతాల డేటాను తెప్పించారు. ఆ మేరకు అక్కడ చదును చేసే కార్యక్రమాలను సైతం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ద్వారా చేయించారు. అయితే క్రేన్ నెం. 4తో పాటు క్రేన్ నెం. 6వ వద్ద కూడా సాగర్‌లో పేరుకుపోయి వ్యర్థాలు, చెత్తాచెదారం, మట్టిని ఇటీవల తొలగించారు. రెండు ప్రాంతాల్లో లోతుగా ఉండటంతో వాటిలో ఏదైనా ఒకదానిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

3841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles