గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

Sun,September 23, 2018 01:07 PM

Khairatabad Ganesh Immersion Completed

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. కన్నుల పండువగా నిర్వహించిన శోభాయాత్ర ద్వారా భారీ వాహనంపై ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న గణనాథుడికి అర్చకులు తుది పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ ద్వారా గణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవడంతో అనుకున్న సమయానికే గణేశుడు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. శోభాయాత్ర కేవ‌లం 6గంట‌ల‌లోపే పూర్తి అయింది. నిర్దేశించిన సమయానికే విగ్రహాన్ని భారీ క్రేన్ సాయంతో నిమజ్జనం చేశారు. లక్షల సంఖ్యలో భ‌క్తులుసప్తముఖ కాలసర్ప గణనాథుడిని దర్శించుకున్నారు.

మహా గణపతిని చూసేందుకు, జంట నగరాల పరిధిలోని ప్రజలే కాకుండా, తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది త‌ర‌లివ‌చ్చారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌ రెడ్డి, పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ త‌దిత‌రులు భారీ గణపతి వద్దకు వచ్చారు.


3964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles