అభివృద్ధి దిశగా.. కల్యాణ్‌పురి కాలనీ

Thu,January 17, 2019 09:30 AM

హైదరాబాద్: నేరేడ్‌మెట్ డివిజన్ పరిధి కల్యాణ్‌పురి కాలనీ దాదాపు 20 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు కాలనీవైపు కన్నెత్తి చూడకపోవడంతో కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీలోని సమస్యలు దశలవారిగా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి హన్మంతరావుల ప్రత్యేక చొరువతో కాలనీ అభివృద్ధికి ఇటీవల రూ.25 లక్షలు మంజూరయ్యాయి. వెనువెంటనే ఎమ్యెల్యే పనులను ప్రారంభించగా కాలనీలో అధ్వానంగా ఉన్న రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతో సుందరంగా దర్శనమిస్తున్నాయి. దీంతో కాలనీవాసులు సంబురపడుతున్నారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై కూడా అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles