కేటీఆర్‌ గారు..మీరు రిప్లై ఇవ్వకపోతే నారా లోకేశ్‌ మీదొట్టు!

Sun,April 28, 2019 02:06 PM

K T Rama Rao responds to public in twitter chat

హైదరాబాద్‌: ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమాధానాలు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.45 గంటల వరకు 'ఆస్క్‌ కేటీఆర్‌' హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రజలతో సంభాషించారు. ఈ సంభాషణలో అనేక అంశాలపై కేటీఆర్‌ సమాధానాలిస్తూ.. తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. ఇలా అనేక అంశాలపై కేటీఆర్‌ సూటిగా, చతురతతో సమాధానాలిచ్చారు.

ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లటం దురదుష్టకరం. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదన కలిగించాయి. త్రిసభ్యకమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపైన త్వరలోనే చర్యలుంటాయి. ఇంటర్‌బోర్డు రద్దు నిర్ణయం ప్రభుత్వానిదే. గ్లోబరీనా సంస్థకు నా మద్దతు ఉందనేది అసత్య ప్రచారం. ఇంటర్‌ పరీక్షల వివాదం తలెత్తేవరకు గ్లోబరీనా ప్రతినిధులెవరో కూడా నాకు తెలియదు.

దుర్గం చెరువు ైప్లెఓవర్‌ నిర్మాణ పనులు మరికొన్ని నెలల్లో పూర్తవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నందునే ప్రభుత్వ దవాఖానాల్లో 40శాతం మేర ప్రసవాలు పెరిగాయి. కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు, వాహనాలను ప్రవేశపెడుతాం. ఎంఎంటీఎస్‌ రెండోదశకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. హైదరాబాద్‌ నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

వచ్చే ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, విద్య, వైద్య, మౌలిక రంగాలపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేయడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. మే 23న వెల్లడించే ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారు. అని పలు ఆసక్తికర ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు.

కొన్ని ఆస‌క్తిక‌ర ట్వీట్లు..

ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా.. కేటీఆర్‌ గారు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వ‌లేదు. మీరు రిప్లై ఇవ్వకపోతే నారా లోకేశ్‌ మీదొట్టు.. అని ఒక నెటిజ‌న్ కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్ బ‌దులిస్తూ.. మధ్యలో ఆయన ఏం చేశాడు బ్రదర్‌(న‌వ్వుతూ) రిప్లై ఇచ్చారు.

నెటిజ‌న్‌: కే ఏ పాల్‌ గురించి ఒక్క మాట చెప్పండి అన్నా..

కేటీఆర్‌: ఆయన ఎన్నిక‌ల‌ ప్రచారం చాలా వినోదాత్మకంగా ఉంటుంది.
7235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles