అమ్మో.. సికిల్ సెల్ ఎనీమియా

Tue,June 19, 2018 09:02 AM

June 19 is World Sickle Cell Anemia day

హైదరాబాద్ : సికిల్ సెల్ ఎనీమియా....ఇది చాపకింద నీరులా వ్యాపిస్తున్న భయంకరమైన రక్తకణాలకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి సోకడం వల్ల రోగిలో రక్తహీనత ఏర్పడి, మెదడు మొద్దుబారి మరణించే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అవగాహనలోపమేనంటున్నారు. వ్యాధిపై అవగాహన కల్పించే క్రమంలో ప్రతి సంవత్సరం జూన్ 19ని ప్రపంచ సికిల్ సెల్ డేగా పరిగణిస్తున్నారు.

సికిల్ సెల్ ఎనీమియా అంటే....


దీనిని ఒక రక్తహీనతకు సంబంధించిన వ్యాధిగా కూడా చెబుతారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలు తమ ఆకారాన్ని కోల్పోయి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఈ విధంగా జరిగే ప్రక్రియనే సికిల్ సెల్ ఎనీమియా అంటారని ప్రముఖ హెమటో అంకాలజిస్టు డా.సోనాలి తెలిపారు. సాధారణంగా ఎర్రరక్త కణాలు గుండ్రంగా, చురుకుగా శరీరంలోని రక్తనాళాల్లో కదులుతాయని, సికిల్ సెల్ ఎనీమియా రోగుల్లో ఎర్ర రక్తకణాలు గుండ్రగా తమ రూపాన్ని కోల్పోయి కొడవలి రూపంలో లేదా అర్ధచంద్రాకారంలోకి మారుతాయన్నారు. ఈ విధంగా ఆకారం కోల్పోయిన ఎర్ర రక్త కణాలు చిన్న రక్తనాళాల్లో ఇరుక్కుపోవడమే కాకుండా త్వరగా చనిపోతాయని, దీనివల్ల రక్తప్రసరణ క్రమంగా తగ్గిపోతుందన్నారు.

వ్యాధికి కారణాలు..


సికిల్ సెల్ వ్యాధికి ప్రధాన కారణం జన్యువులోపం. ఈ వ్యాధిగ్రస్తులు రెండు సికిల్ సెల్ జన్యువులతో జన్మిస్తారని డా.సోనాలి తెలిపారు.

1235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles