ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్న జేబీఎస్ టూ ఎంజీబీఎస్ మెట్రో

Thu,September 19, 2019 06:52 AM

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేబీఎస్ నుం చి ఎంజీబీఎస్(కారిడార్ 2) ఆపరేషన్స్‌కు రంగం సిద్ధమైంది. ట్రాక్‌తో పాటు స్టేషన్లు పూర్తి చేసుకుని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి దాదాపు సమాయత్తమైంది. ఇప్పటికే కారిడార్-2కు సంబంధించి సగం వరకు సీఎంఆర్‌ఎస్ తనిఖీలు పూర్తికాగా మిగతా భాగం పూర్తిచేసుకుని సెప్టెంబర్ చివరివారంలో లేదా అక్టోబర్ మొదటివారంలో ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజులపాటు ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం అధికారిక ఆపరేషన్స్ నిర్వహించనున్నారు. 15 కిలోమీటర్ల మార్గంలో ముందుగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గల 9.6 కిలోమీటర్ల మార్గాన్ని నవంబర్‌లో అందుబాటులోకి తేవడానికి నిర్ణయించారు. దాదాపు అన్ని స్టేషన్ల పనులతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ, ట్రాక్‌ను పూర్తిచేసి ఆపరేషన్స్‌కు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రోరైలుకు చెందిన అధికారులు వెల్లడించారు. ఈ కారిడార్ అందుబాటులోకి రావడం వల్ల మెట్రో రైలు మొదటిదశ దాదాపు పూర్తవుతుంది.
కారిడార్-2 (15 కి.మీటర్లు) స్టేషన్లు (15)..
జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 15 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది కారిడార్ 2 రూట్. రోడ్డు మార్గం ద్వారా అనేక అవాంతరాలతో ప్రయాణిస్తే ఒక గంట 10 నిమిషాలు సమయం పడుతుంది. అదే మెట్రోలో ప్రయాణిస్తే 15 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లో చేరుకుంటాం. ఈ మార్గంలో పరేడ్‌గౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్‌గంజ్, ఫలక్‌నుమా.

5079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles