3న ఇస్కాన్ జన్మాష్టమి

Sat,September 1, 2018 10:03 AM

Janmastami celebrations in iskcon hyderabad held on september 3rd

హైదరాబాద్: ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్) కూకట్‌పల్లి విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు మహాశృంగదాస తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణా అవతార్‌దాస్, శ్రీ వాణి, మిశ్రీలాల్‌లతో కలిసి మాట్లాడారు. ఉదయం 5గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు బాల బాలికల గోపాలకృష్ణుని వేషధారణ ప్రదర్శన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీకృష్ణునిగా, బలరాముడు, రాధారాణి, గోపికలుగా, గోపబాలురుగా అలంకరించి కూకట్‌పల్లిలోని తమ కేంద్రానికి తీసుకురావాలని, ప్రతిభ కనబర్చే చిన్నారులకు బహుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 4న ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles