గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు

Tue,September 11, 2018 09:29 AM

Jagga Reddy Completes Medical Tests in Gandhi Hospital

హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి జగ్గారెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు. నకిలీ సర్టిఫికెట్‌తో పాస్‌పోర్టు ఇచ్చేందుకు సహకరించిన దానిపై దర్యాప్తు చేస్తున్నామని నార్త్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు. అక్రమ రవాణా చేయడంపై చర్యలు తీసుకుంటున్నాం. జగ్గారెడ్డి కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను విచారిస్తామని తెలిపారు.

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సంపాదించారు. వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లతో వీసాలు పొంది.. ముగ్గురినీ తన వెంట అమెరికాకు తీసుకెళ్లారు. వారిని అక్కడ దించిన జగ్గారెడ్డి.. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.ఈ ముగ్గురు అమెరికాకు వెళ్లి పద్నాలుగేండ్లయినా ఇంతవరకు తిరిగిరాలేదు. దీనిపై అనుమానం వచ్చిన అమెరికన్ కాన్సులేట్ అధికారులు.. ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles