జయరాం హత్య కేసులో ముగిసిన పోలీసుల విచారణ

Wed,February 20, 2019 05:57 PM

investigation completed in jayaram murder case

హైదరాబాద్: జయరాం హత్యకేసులో పోలీసు అధికారుల విచారణ ముగిసింది. మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ను దర్యాప్తు అధికారి కేఎస్ రావ్ ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి సమాధానాలు, పోలీసుల సమాధానాలను అధికారులు బేరీజు వేసుకుంటున్నారు. ఈసందర్భంగా డీసీపీ శ్రీనివాస్ జయరాం హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసు అధికారులను విచారించాం. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను విచారించాం. కేసుకు సంబంధించి అధికారుల నుంచి ప్రతీ విషయం తెలుసుకున్నాం. హత్య జరగకముందు, జరిగిన తర్వాత కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించాం. రాకేశ్ రెడ్డి తన స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే.. ఫోన్ కాల్‌లో తనకు చెప్పాడని ఏసీపీ మల్లారెడ్డి చెప్పాడు. విచారణ పారదర్శకంగా జరుగుతోంది. హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.

జయరాంను రాకేశ్ రెడ్డి హత్య చేశాడని మీడియాలో వచ్చే వరకు తమకూ తెలియదని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాయదుర్గం సీఐ ఫోన్‌ కాల్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేశాడు. రాకేశ్ రెడ్డికి టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నది వాస్తవం. హత్య జరిగిన తర్వాత రాజకీయ నేతలతో రాకేశ్ రెడ్డి మాట్లాడలేదు. 53 ఎకరాల కబ్జాలో 6 ఎకరాలు కబ్జా చేయాలని రాకేశ్ రెడ్డి ప్రయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

2139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles