ప్రాణాన్ని బలిగొన్న సరదా వ్యాఖ్యలు

Sat,July 14, 2018 07:47 AM

inter student suicide for his girl friend in Dundigal

హైదరాబాద్ : స్నేహితులతో కలిసి చేసిన సరదా వాఖ్యలు ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు దారితీశాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్‌నగర్ డివిజన్, సూరారంకాలనీ సాయిబాబానగర్ అంజిరెడ్డి బస్తీకి చెందిన యాట నర్సింగరావు కొడుకు చంద్రశేఖర్(18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాలలో చంద్రశేఖర్‌కు తనతో పాటు చదివే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం చంద్రశేఖర్ తన స్నేహితులతో కలసి సరదా ముచ్చట్లు మాట్లాడుకుంటూ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిపి.. సదరు అమ్మాయికి ఫోన్ చేశాడు. నువ్వు లేకుంటే నేను లేనని .. నువ్వు చావమంటే చస్తానని అమ్మాయికి తెలిపాడు. అయితే సదరు అమ్మాయి సరదాగా మాట్లాడుతున్నాడేమో అనుకొని ఏది చావు చుద్దామని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రశేఖర్ గదిలో ఫ్యాన్‌కు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

3785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles