బాధితురాలి ఫిర్యాదుతో ఖరగ్‌పూర్ యువకుడు అరెస్ట్

Sun,October 14, 2018 07:20 AM

instagram harassment to girlfriend

హైదరాబాద్ : చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు... ఇద్దరి మధ్య స్నేహం బలపడింది... ఈ స్నేహంతో యువకుడి యువతి మీద ప్రేమను పెంచుకున్నాడు... యువతి మాత్రం అతన్ని ఫ్రెండ్‌గానే చూసింది... సాఫ్ట్‌వేర్ సంస్థలో మంచి కొలువు రావడంతో యువతి హైదరాబాద్‌కు వచ్చేసింది... కొత్త స్నేహితులతో తనను మర్చిపోయిందని యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అంతే... ముందు వెనక ఆలోచించకుండా ఆమెపై ప్రతీకారం సాధించాలనుకున్నాడు. దీని కోసం ఇన్‌స్టాగ్రాంను వేదికగా చేసుకున్నాడు. దీనికి తన ఖాతాకు లస్ట్(కామం)...లవ్(ప్రేమ)...రివేంజ్(ప్రతీకారం)ను టైటిల్‌గా పెట్టుకున్నాడు. ఈ ఖాతాతో వేధింపులు ప్రారంభించి ఓ చిన్న ఆవేశంతో చివరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి...

ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన సోనూ చిన్నప్పటి నుంచి తన స్కూల్‌లో చదివే యువతితో స్నేహం చేశాడు. ఆమె కూడా సోనూను మంచి స్నేహితుడిగా భావించింది. ఇలా ఇద్దరు ఇంటర్ వరకు చదివారు. యువతి ఇంజినీరింగ్ పూర్తి చేయగా, సోనూ డిగ్రీ పూర్తి చేసి ఖరగ్‌పూర్ ప్రాంతంలో ఓ కిరాణ దుకాణం పెట్టుకుని జీవ నం సాగిస్తున్నాడు. యువతికి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం రావడంతో ఆమె ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఉద్యోగంలో బిజీ కావడం...ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడంతో ఆమె సోనూతో మాట్లాడడం తగ్గించేసింది. అయితే... సోనూ ఈ స్నేహాన్ని ప్రేమగా భావిం చి, యువతి మీద ప్రేమ, వ్యామోహన్ని పెంచుకున్నాడు. యువతి దూరం పెట్టిన విషయాన్ని జీర్ణించుకోలేక ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుని ఇన్‌స్టాగ్రాంలో ఓ ఖాతాను తెరిచాడు. ఈ ఖాతా టైటిల్‌గా లస్ట్(కామం)... లవ్(ప్రేమ)... రివేంజ్(ప్రతీకారం) పెట్టుకుని యువతికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగాడు. స్నేహితుడిగా భావించిన సోను చేష్టలకు గురైన యువతి భయాందోళనకు గురైంది. ఈ వ్యవహారంపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన అధికారులు సోనూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో యువతిపై పగ తీర్చుకోవడానికే తాను ఈ విధంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్టింగ్‌లు పెట్టానని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్‌గా ఉన్న తనను దూరం పెట్టడం సహించుకోలేకపోయానని అతను స్పష్టం చేశాడు. యువకులకు సరైన విధంగా కౌన్సెలింగ్ లేకపోవడమే ఇలాంటి ప్రతీకారాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు అభిప్రాయపడుతున్నారు. యువకులు ఆవేశంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం మరుస్తున్నారని అధికారులు వివరిస్తున్నారు. కానీ... అక్రోశంతో ఇలాంటి చర్యలకు పాల్ప డేవారు అప్పటి వరకు కొంత సంతోషానికి గురైనప్పటికీ చట్టరీత్యా జైలు ఊచలతో పాటు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను మరుస్తున్నారని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఒక్కసారి యు వతులు, మహిళలను వేధిస్తూ దొరికితే వారి పేర్లు ఎప్పటికీ పోకిరీల జాబితాలో పదిలంగా ఉంటాయనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles