యుద్ధం వస్తే తుపాకులు పట్టుకునేందుకు సిద్ధం

Sun,August 13, 2017 05:52 AM

India ready for war with china or pakistan, says dattatreya

హైదరాబాద్ : పాక్, చైనాలతో యుద్ధ్దం వస్తే తుపాకులు పట్టుకోవడానికి దేశ యువత, తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన తిరంగా యాత్రను మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ చైర్‌పర్సన్ పేరాల శేఖర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. చైనా నుంచి వచ్చే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టే సత్తా మనకు ఉందని, దేశంలోని 125 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి, దేశాన్ని రక్షిస్తున్న జవాన్లకు బాసటగా నిలువాలన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశం రూపురేఖలు మార్చి అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపేందుకు సంకల్పించారన్నారు. ఎమ్మెల్యేలు బాబుమోహన్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రామ్మోహన్, ప్రేమ్‌రాజ్, ఎన్‌డి నగేశ్, వైద్యనాథ్ పాల్గొన్నారు.


779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles