ఇంట్లో కూర్చుని విదేశీ భాష‌లు నేర్చుకోవాల‌నుకుంటున్నారా?

Sat,August 12, 2017 07:48 PM

IFL University will start foreign languages free online training soon

హైద‌రాబాద్ : ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఇంట్లో కూర్చుని విదేశీ భాష‌లు నేర్చుకోవాల‌నుకుంటున్నారా?.. ఐతే మీ క‌ల నెర‌వేరినట్లే. అవును ఇంటివ‌ద్ద కూర్చుని మీకు న‌చ్చిన ఫారిన్ లాంగ్వేజ్‌ను ఉచితంగా నేర్చుకోవ‌చ్చు. హైద‌రాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ(ఇఫ్లూ) త్వ‌ర‌లోనే ఈ అవ‌కాశాన్ని క‌ల్పించ‌నుంది. ఆన్‌లైన్ ద్వారా ఫారెన్ భాష‌ల‌ను నేర్పించ‌డానికి క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

యూనివర్సిటీలోని కొంత మంది సిబ్బంది దీనిపై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌ని చేస్తున్నారు. ఈ ప్ర‌యోగం ఫ‌లిస్తే ఇఫ్లూ సేవ‌లు ఎంతో మంది ఔత్సాహికుల‌కు మేలు చేయ‌నున్నాయి. చాలా మంది విద్యార్థులైతేనేమీ, వ్యాపార‌స్తులైతేనేమీ, త‌ర‌చూ విదేశాల‌కు వెళ్లే సినిమావాళ్లు.. ఇలా చాలా మందికి అవ‌స‌ర‌మైన పాఠ్యాంశాల‌ను త‌యారు చేస్తున్నారు. అర‌బిక్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, చైనీస్‌, జ‌పానీస్‌, పార్శీ, స్పానిష్‌, ట‌ర్కిష్‌, కొరియ‌న్‌, ఇటాలియ‌న్ వంటి భాష‌ల‌ను ఇఫ్లూ ఆన్‌లైన్‌లో నేర్పించ‌నుంది. ప్ర‌స్తుతం కొన్ని భాష‌లనే ఎంచుకున్నా తర్వాత మ‌రిన్ని విదేశీ భాష‌ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఇఫ్లూ వీసి సురేష్ కుమార్ తెలిపారు.

ప్ర‌స్తుతం స్కూలు పిల్లాడి నుంచి ముస‌లొల్ల‌వ‌ర‌కు ప్ర‌తి వ్య‌క్తి ఇంట‌ర్నెట్ ఉప‌యోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్ర‌తి మ‌నిషి అర‌చేతిలో ఇంట‌ర్నెట్ ఉంటుంది. సో.. ఆన్‌లైన్‌లో ఫారెన్ భాష‌ల శిక్ష‌ణ ఉచితంగానే కాదు డ‌బ్బుల‌కు కూడా నేర్చ‌కునే ఛాన్స్ ఉంది. మొబైల్ ఫోన్ ద్వారా కూడా నేర్చుకోవ‌చ్చు.

2080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS