అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు: సీపీ అంజనీ కుమార్‌

Wed,June 12, 2019 04:07 PM

If anyone spread rumors will face legal action says hyderabad cp Anjani kumar

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు అదృశ్యమౌతున్నారన్న విస్తృత వార్తా ప్రచారాలపై హైదరాబాద్‌ నగర సీపీ అంజనీ కుమార్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా సీపీ స్పందిస్తూ.. అటువంటి వార్తలు అసత్యమన్నారు. తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గతేడాది అదృశ్యమైన వారిలో 87 శాతం మంది ఆచూకీ కనుగొన్నట్లు చెప్పారు. మిగతావారి కోసం నేటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కావునా ఎవరైనా అసత్యాలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles