రేవంత్‌రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ అధికారుల సోదాలు

Sat,September 29, 2018 08:06 AM

I-T officials seize 'key documents' from Revanth Reddy's house

హైదరాబాద్: డొల్ల కంపెనీలు, బినామీ పేర్లతో అక్రమార్జనలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెండోరోజైన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అక్రమ మార్గాల్లో నగదు ప్రవాహానికి సంబంధించిన అంశాలను ఇవాళ ఉదయం 2.30 గంటల వరకు ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శనివారం ఉదయం 2.30 గంటల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 43 గంటల పాటు రేవంత్ నివాసంలో కీలకపత్రాలపై సమాచారం తెలుసుకున్నారు. అక్టోబర్ 3న ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రింటర్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

31 గంటల పాటు రేవంత్‌రెడ్డిని పలు ఆధారాల కోసం ప్రశ్నించారు. 150 ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి నుంచి అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానాలు తీసుకున్నారు. అక్టోబర్ 1న రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి, ఉదయసింహ.. అక్టోబర్ 3న రేవంత్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

3861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles