ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడి రిమాండ్

Fri,January 11, 2019 09:42 AM

హైదరాబాద్ : ఓ బాలికను మోసం చేసిన సంఘటనలో ఇద్దరు అబ్బాయిలను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ యాదయ్య కథనం ప్రకారం మైనర్ బాలిక, మైనర్ బాలుడు అక్షయ్‌కి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బాలుడు అక్షయ్‌కి కృష్ణశర్మ(24)అనే యువకుడు అన్ని విధాలుగా సహకరించేవాడు. అయితే బాలుడితో బాలిక ఫోన్‌లో చేసిన చాటింగ్‌లు తండ్రికి కూడా వస్తుండేవి. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జికి రమ్మని బాలుడు బాలికకు మెసేజ్ పెట్టడంతో విషయం తెలుసుకున్న బాలిక తండ్రి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దిల్‌సుఖ్‌నగర్‌లో బాలికను, బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించి బాలికను తండ్రికి అప్పగించారు. బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు బాలుడిని, బాలుడికి సహకరించిన కృష్ణశర్మపై సెక్షన్ 354, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ యాదయ్య తెలిపారు.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles