రేపటి నుంచి అక్టోబర్ 28వరకు మాన్‌సూన్ రేసులు

Wed,July 17, 2019 08:17 AM

Hyderabad Monsoon Races from tomorrow

మలక్‌పేట: మలక్‌పేటలోని హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ఈ నెల 18 నుంచి అక్టోబర్ 28వరకు మాన్‌సూన్ రేసులు నిర్వహించనున్నట్లు రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి రేస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రేస్‌క్లబ్‌లో ఈ మాన్‌సూన్ సీజన్‌లో రూ.10.59 కోట్లతో మొత్తం 28 రోజులు రేస్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. రేసులలో ట్రోపీల విలువ రూ.17.93 లక్షలు కాగా, ఒక్కో గుర్రంపై రూ.2.46 లక్షల ఆఫర్ ప్రకటించటం హైదరాబాద్ రేస్‌క్లబ్‌దే దేశంలో అత్యధికమని పేర్కొన్నారు.

వింటర్ రేస్‌లు డిసెంబర్ రెండు నుంచి 2020 ఫిబ్రవరి 17 వరకు జరుగనున్నాయని వివరించారు. ఆగస్టు 5న ది కె.మహిపతిరావు మెమోరియల్ గోల్కొండ్ జువెనైల్ మిలియన్, 12న ది నిజామ్స్ గోల్డ్ కప్, 18న ది గవర్నర్స్ కప్, 26న దక్కన్ ఫిల్లీస్ చాంపియన్‌షిప్ స్టేక్స్, సెప్టెంబర్ 2న ది దక్కన్ కోల్ట్స్ చాంపియన్ షిప్, 9న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ కప్, 16న ది చీఫ్ మినిష్టర్స్ కప్, అక్టోబర్ 2న ది దక్కన్ సెర్బీ, 14న ది మెల్బోర్న్ రేసింగ్ క్లబ్ ట్రోపీ, 21న ది గోల్కొండ సెంట్ లేజర్, 28న ది దొడ్ల ప్రతాప్‌చందర్ రెడ్డి మెమోరియల్ మిలియన్ రేస్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 2 నుంచి ఫిబ్రవరి 17 వరకు వింటర్ రేస్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2న ది గోల్కొండ 1000 గునియాస్, 16న ది గోల్కొండ 2000 గునియాస్, 2020 జనవరి 6న ది గోల్కొండ ఓక్స్, 13న ది బైయెర్లీ టర్క్ మిలియన్, 19న ది గోల్కొండ డెర్బీ స్టేక్స్, 20న ది డార్లే అరేబియన్ మిలియన్, 28న ది కాకతీయ మిలియన్, ఫిబ్రవరి 10న ది గోడోల్‌పిన్ బార్బ్ మిలియన్, 17న ది అల్‌కాక్ అరేబియన్ మిలియన్ రేస్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రేస్ స్టేక్స్‌ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles