షర్మిల ఫిర్యాదుతో 8 వెబ్‌సైట్లకు పోలీసుల నోటీసులు

Sat,January 19, 2019 07:12 PM

hyderabad cyber crime police issued notices to 8 websites over sharmila and prabhas fake posts

హైదరాబాద్: వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల, సినీ హీరో ప్రభాస్ మధ్య సంబంధాన్ని అంటగడుతూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు, వీడియోలు షేర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిపై షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 8 వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. ఫేక్ పోస్టులతో సంబంధమున్న ఐదుగురికి పోలీసులు అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. పదిరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని యూట్యూబ్ చానెళ్లకు ఆదేశాలు జారీ చేశారు. చానెల్ యజమానులను పోలీసులు విచారిస్తున్నారు. వీడియో లింక్‌లకు కామెంట్లు పెట్టిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వీడియో, ఆడియో తయారు చేసిన వారిని ప్రశ్నించారు.

2797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles