ప్రేమించి గెలిచాడు... పెళ్లాడి ఓడిపోయాడు

Sat,January 5, 2019 10:22 AM

hyderabad central mall manager committed suicide for family dispute

మెహిదీపట్నం : ప్రేమించి పెండ్లి చేసుకున్నారు... వారి అన్యోన్య జీవితానికి ఎనిమిదేండ్ల బాలుడు... అయితే పెండ్లి అయిన పదేండ్లకు దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి... పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు కొడుకును మంచిగా చదువుకోవాలని, బాగా ఉండాలని చెబుతూ గోరుముద్దలు తినిపించాడు... కొడుకు నిద్ర పోయాక ... ఇంట్లో హాల్లోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్ కోరని సునీల్ కథనం ప్రకారం.... మెహిదీపట్నం విజయ్‌నగర్ కాలనీలో నివసించే విజయ్‌బాబు అలియాస్ దుర్గ ప్రభువు(34) పంజాగుట్ట సెంట్రల్ మాల్‌లో మేనేజర్. 10 సంవత్సరాల క్రితం అమీర్ పేట్ ప్రాంతంలో పరిచయం అయిన రాణిని ప్రేమ వి వాహం చేసుకున్నాడు. వీరికి వినోష్(8)బాబు. ఇటీవల భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.అంతే కాకుండా రాణి... డిసెంబర్ 29న భర్తపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. నాలుగు రోజుల క్రితం కుమారుడు వినోష్‌ను భర్త వద్ద వదిలి నల్లకుంటలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో నాలుగు రోజులుగా బాధతో ఉన్న విజయ్‌బాబు కుమారుడు వినోష్‌ను ట్యూషన్‌కు కూడా పంపడం లేదు.

రాత్రి కుమారుడిని మంచిగా చదువుకోవాలని, బాగా ఉండాలని చెప్పి అన్నం తినిపించి పడుకోబెట్టాడు. బాబు పడుకున్న తర్వాత హాల్లోకి వెళ్లి కొక్కానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి నిద్ర మేల్కొన్న బాబు తన పక్కన తండ్రి లేకపోవడం గమనించి బయటకు వచ్చి చూడగా తండ్రి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే బాలుడు... తన ఇంటి పై పో ర్షన్‌లో ఉన్న వారిని లేపి తండ్రి ఉరి వేసుకున్న విషం చెప్పగా.. వారు వచ్చి చూసి పోలీసులకు స మాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పటి వరకు గోరుముద్దలు తినిపించి నిద్ర పుచ్చిన తన తండ్రి ఉరివేసుకుని చనిపోయాడన్న విషయాన్ని బాలుడు వినోష్ బంధువులకు ఫోన్‌చేసి చెప్పడం... సంఘటనా స్థలానికి చేరుకున్న వారిని విస్మయానికి గురిచేసింది. అర్ధరాత్రి దా టిన తర్వాత ఇంటి సమీపంలో ఉన్న బంధువులకు బాలుడు తన తండ్రి చనిపోయిన విషయం చెప్పడం... అక్కడ ఉన్న వారిని కలచి వేసింది.

6694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles