
హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ ఇట్రానెట్ సర్వర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. ఈ నెల 9న అర్ధరాత్రి 12.27 గంటల ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ టెలికం డిస్ట్రిక్ట్ సర్వర్‌పై ర్యాన్సమ్వేర్ వైరస్‌తో దాడి చేయడంతో ఒక్కసారిగా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఎన్‌క్రిఫ్ట్ ఎక్స్‌టెన్షన్‌తో సర్వర్ స్టిమ్లోని ఫైల్స్ మారిపోయాయి. ఒక్కో హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఒక్కో ఫోల్డర్‌గా జనరేట్ అయ్యాయి. 800 యూఎస్డీ డాలర్లు, బిట్‌కాయిన్ రూపంలో చెల్లించాలంటూ హ్యాకర్లు డిమాండ్ చేశారు. దాడికి గురైన సర్వర్ వెబ్ సర్వర్‌గా, అంతర్గతమైన సమాచారాన్ని చేరవేసుకునేందుకు ఉపయోగిస్తారు.
టెలిఫోన్భవన్లో ఉన్న ఈ వెబ్సర్వర్ ద్వారా డిపార్టుమెంట్లో అంతర్గతమైన(ఇట్రానెట్) కమ్యూనికేషన్ కోసం దీనిని ఉపయోగిస్తారు. 800 డాలర్లు చెల్లిస్తేనే తమ దాడిని ఉపసంహరించుకుంటామంటూ హ్యాకర్లు హెచ్చరించారు. అయితే అంతర్గత సమాచారాన్ని చేరవేసే సర్వర్‌లోని ఫైల్స్‌ని అన్ని కరెప్ట్ అయ్యాయి. దీంతో ఆ సర్వర్‌లోని డాటా పాడైపోయింది. ఈ సర్వర్‌తో పాటు మరో కంప్యూటర్‌పై 10న మరోసారి దాడి జరిగింది. విండోస్ 2012 సర్వర్‌ను ఈ వెబ్‌సర్వీస్ సేవలకు ఉపయోగిస్తుండడంతో దీనిపైనే ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది.
యాంటీ వైరస్, ఫైర్‌వాల్స్ అన్ని పకడ్బందీగా ఉన్నా బీఎస్‌ఎన్‌ఎల్‌లోని సర్వర్‌పై హ్యాకర్లు దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని సర్వర్లపైనే హ్యాకర్లు దాడి చేస్తే మామూలు సంస్థల పరిస్థితి ఏంటనే సందేహం విన్పిస్తుంది. ర్యాన్సమ్వేర్ దాడిపై బీఎస్ఎన్ఎల్ సబ్‌డివిజనల్ ఇంజినీర్(ఐటీ) లక్ష్మణ్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాన్సమ్వేర్ హ్యాకర్లతో పాటు, ఎన్‌క్రిప్ట్ అయిన డాటాను రికవరీ చేయాలంటూ పోలీసులను కోరారు. ర్యాన్సమ్ వేర్ దాడి బీఎస్‌ఎన్‌ఎల్‌లోని అంతర్గత వ్యవహారాలకు ఉపయోగించే సర్వర్‌పై జరిగిందని, దీని వల్ల పెద్దగా నష్టం ఏమి లేదని ఏసీపీ చక్రవర్తి వెల్లడించారు.