భార్యతో గొడవ.. భర్త అదృశ్యం

Wed,May 29, 2019 06:48 AM

husband missing after fighting with wife in malkajgiri

హైదరాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ కథనం ప్రకారం.. వెంకటేశ్వరనగర్‌లో రాజు(48), మహేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. మహేశ్వరి ఇంట్లో టైలరింగ్ చేస్తుండగా, రాజు ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. కాగా.. రాజు నిత్యం భార్యను వేధించి డబ్బులు తీసుకుని మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ ఉదయం భార్యతో రాజు గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. మహేశ్వరి బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా రాజు ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

3449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles