బతుకుబండి లాగలేక తనువు చాలించారు..

Thu,May 2, 2019 08:01 AM

husband and wife committed suicide in hyderabad

హైదరాబాద్: బతుకుబండి లాగలేక దంపతులు తనువు చాలించిన సంఘటన సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోండామార్కెట్ ఆదయ్యనగర్ ప్రాంతంలో నివసించే హరినాథ్(58), సునీత(50) భార్యభర్తలు. వీరికి 22 ఏండ్ల క్రితం వివాహమైంది. ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేసే హరినాథ్ ఓ కేసులో 12 ఏండ్ల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. కాగా, 15 ఏండ్ల క్రితం ఓ కుమారుడు జన్మించి మృతి చెందాడు.

నాటి నుంచి నేటి వరకు వారికి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కాగా సునీత కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నది. అయితే ఇటీవల సునీతకు మలేరియా జ్వరం రావడంతో గాంధీ దవాఖానలో చికిత్స చేయించుకున్నది. దీనికి తోడు వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దంపతులిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం సునీత ఫ్లోరింగ్‌పైన మృతి చెందగా, హరినాథ్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.

కాగా, హరినాథ్ తాము అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోటు రాసిపెట్టాడు. అయితే మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సాధారణంగా మృతి చెంది ఉండవచ్చునని భావించినప్పటికీ భార్య చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

3148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles