భర్త, అతని ప్రియురాలు అరెస్ట్

Thu,November 1, 2018 08:20 AM

Husband and his girlfriend was arrested in hyderabad

హైదరాబాద్ : ప్రియురాలితో కలిసి భార్యపై ఆన్‌లైన్‌లో అసత్య ప్రచారం చేస్తున్న ఇద్దరిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... వనస్థలిపురం, ఎస్‌కేడీనగర్‌కు చెందిన అలపాటి తులసీదాస్ ఆస్ట్రేలియాలో బీబీఏ చదవి... ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇతనికి భార్య ఉంది. కాగా.. ఫుడ్‌టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం అజిస్టో ఇండస్ట్రీస్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న మౌనిక, భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నది. 2017లో బంజారాహిల్స్‌లోని డాక్టర్స్ బిల్డింగ్‌లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్‌లో తులసీదాస్, మౌనికలు అనుకోకుండా పరిచయమయ్యారు. ఈ పరిచయం స్నేహంగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న తులసీదాస్ భార్య వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో మౌనిక, తులసీదాస్‌లు ఒక ప్లాన్ వేశారు. తులసీదాస్ .. తన భార్యను సమాజం చీదరించుకునేలా అవమానించాలనుకున్నాడు. దీంతో బాధితురాలికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను వాట్సాప్‌లో పెట్టి, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెట్టారు. దీంతో బాధితురాలు గుర్తుతెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త తులసీదాస్, అతని ప్రయురాలు మౌనికలు పథకం ప్రకారం ఇలా చేశారని నిర్థారించి, వారిని అరెస్ట్ చేశారు.

3570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles