హోరెత్తిన నగరం!

Mon,September 3, 2018 09:23 AM

huge hyderabad people went to pragathi nivedana sabha

హైదరాబాద్: మొత్తంగా గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది. ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాగా, నగరం నుంచి కొంగరకలాన్‌కు జనం పొటెత్తారు. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జెండాలు ఊపి ర్యాలీలను ప్రారంభించారు.

- రాంగోపాల్‌పేట డివిజన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుల్లెట్ వాహనం నడిపి కేడర్‌ను ఉత్సాహపరిచారు.
- జగద్గిరిగుట్టలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాహనాల శ్రేణిని జెండా ఊపి ప్రారంభించారు.
- ఉప్పల్ నియోజకవర్గంలో ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మేదరి సంఘం ప్రతినిధుల ర్యాలీని ప్రారంభించారు.
- గోషామహల్ నియోజకవర్గంలో రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పాల్గొని వాహనాలకు జెండా ఊపి తరలించారు.
- అంబర్‌పేటలో మాజీ మంత్రి కృష్ణాయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డిలు బైక్ ర్యాలీల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
- పాతబస్తీ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సభకు ముందుకు కదిలారు. సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ నేతృత్వంలో ముస్లిం మహిళలు, బహద్దూర్‌పురా, యాకత్‌పురా నియోజకవర్గాల బాధ్యులు ఖైసర్, షబ్బీర్ అలీల నేతృత్వంలో వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ధూంధాంతో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్న కొంగరకలాన్‌కు పయనమయ్యారు. పలు ప్రాంతాల నుంచి చార్మినార్ వద్ద చేరిన పాతబస్తీ వాసులంతా అక్కడి నుంచి సభకు వెళ్లారు.
- ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి చైతన్యపురి డివిజన్ నుంచి హర్ష అనే అమ్మాయి బుల్లెట్ వాహనంపై ర్యాలీగా బయలుదేరి అందరి దృష్టిని ఆకర్షించింది.
- మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
- ఉప్పల్, దిల్‌సుక్‌నగర్, మలక్‌పేట, గాజులరామారం, నల్లకుంటల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలతో కొంగరకలాన్‌కు వెళ్లారు.
- షాద్‌నగర్ నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డి భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చారు.
- మేడ్చల్ నుంచి ట్రాక్టర్లలో రైతులు పెద్ద ఎత్తున కదలివెళ్లారు.
- కూకట్‌పల్లిలో గొట్టిముక్కుల వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలోనే భారీ బైక్‌ర్యాలీగా కదిలారు.
- మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి నేతృత్వంలో ర్యాలీగా తరలివెళ్లగా, కార్పొరేటర్ చింతల విజయశాంతి బోనమెత్తి ప్రత్యేకంగా నిలిచారు.

1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles