అప్పుడు నిల్..ఇప్పుడు ఫుల్

Sat,September 14, 2019 10:02 AM

Huge demand for government colleges in telangana

ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. భారీగా ప్రవేశాలు పొందిన విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఫీజులు కట్టే స్థోమత లేక.. పుస్తకాలు కొనుక్కునే ఆసరా లేక.. ఒకప్పుడు విద్యార్థులు చేరాలంటే నాలుగుసార్లు ఆలోచించే రోజుల నుంచి గట్టెక్కి.. మూడు పదులకు చేరువలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ప్రవేశాలు పొటెత్తాయి. 2015 -16 విద్యాసంవత్సరంలో కేవలం 6504, 2016-17 లో 8వేల మంది మాత్రమే ప్రవేశాల పొందగా, తాజాగా వీరి సంఖ్య 9,630కి చేరుకుంది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల -హుస్సేనిఆలంలో అత్యధికంగా 905 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా ప్రారంభించిన బోరబండ, సితాఫల్‌మండీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు ఆశాజనకంగా లేవు. అయితే కాలేజీల్లో చేరిన విద్యార్థుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు. విద్యార్థుల వివరాలతోపాటు, ఫొటో, సంతకాలను అప్‌లోడ్ చేస్తున్నారు.

కాలేజీలు పునరుజ్జీవనం

ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడంతోపాటు ఉచితంగా విద్యనందిస్తుండటంతో ప్రభుత్వ కాలేజీలకు విద్యార్థులు క్యూకడుతున్నారు. నయా పైసా తీసుకోకుండా. ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యనందిస్తున్నారు. దీని ఫలితంగా వందల్లో అడ్మిషన్లు పొందారు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందే సైన్స్ విద్యార్థులు రూ.893, ఆర్ట్స్ విద్యార్థులు రూ.530, ఒకేషనల్ విద్యార్థులు రూ.993 ఫీజు మాఫీ కాగా.. పాఠ్యపుస్తకాల కోసం రూ.800 వరకు ఫీజు రాయితీగా లభిస్తున్నది. ఇది పేద విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ చొరవతో అంపశయ్యపై నిర్వీర్యమవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలు తాజాగా విద్యార్థుల చేరికతో పునరుజ్జీవనం దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వ ఉదారత ద్వారా.. విద్యావ్యవస్థ పటిష్టం కావడంతోపాటు. పేద విద్యార్థులకు ఉపశమనం లభిస్తున్నది.

753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles