గుర్రపు పందాలపై బెట్టింగ్.. ఇద్దరు అరెస్టు

Mon,January 28, 2019 09:34 AM

horse racing betting gang arrested in hyderabad

హైదరాబాద్: ఎలాంటి లైసెన్సులు లేకుండా గుర్రపు పందాలపై ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌లో అక్రమ బెట్టింగులు నిర్వహిస్తూ లైసెన్స్‌డ్ బుకీలను బురిడీకొట్టిస్తున్న ఇంటిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి రూ.10 వేలు, ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన ప్రకారం.. మలక్‌పేటలోని రేస్‌కోర్సులో గుర్రపు పందాలకు సంబంధించి పందెం కాయాలంటే రేస్‌కోర్స్‌లో లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన వాళ్లే పంటర్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకొని గుర్రాలకు సంబంధించిన నంబర్లు తీసుకొని పందాలు కాస్తుంటారు. అయితే ఆస్మాన్‌ఘడ్‌కు చెందిన అన్నదమ్ములు కనకాని రాజ్‌గోపాల్(55), కనకాని శ్యాం(50) అక్రమంగా గుర్రపు పందాలు కాస్తుంటారు.

ఒకరు మామూలు ప్రేక్షకుల్లాగా టికెట్ తీసుకొని రేస్‌కోర్స్‌లోకి వెళ్లి తక్కువ డబ్బులకే పందెం కాయవచ్చని ఆశచూపి పంటర్స్ నుంచి డబ్బులు తీసుకుంటూ పందెం గుర్రాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుండగా, మరొకరు ఎలాంటి లైసెన్స్ పొందకుండా ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌లో బెట్టింగులు నిర్వహిస్తూ అక్రమంగా పంటర్స్ డబ్బులు దండుకుంటూ లైసెన్స్‌డ్ బుకీలను బురిడీకొట్టిస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆస్మాన్‌ఘడ్‌లోని ఓ ఇంట్లో నుంచి గుర్రపు పందాలపై అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కనకాని రాజ్‌గోపాల్ ఇంటిపై దాడిచేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10వేలు, ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles