నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

Sun,August 13, 2017 05:57 AM

honest auto driver gives laptop to police

హైదరాబాద్ : ఆటోలో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన ల్యాప్‌టాప్‌ను ఆటోడ్రైవర్ తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని సయ్యద్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఫారూఖ్ అన్సారీ ఆటో డ్రైవర్. ఈ నెల 10న జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఫిలిం మేకింగ్ కోర్సు చదువుతున్న వైభవ్ ఫారూఖ్ ఆటో ఎక్కి రోడ్ నెం.13లో దిగిపోయాడు. మరుసటిరోజు ఆటో శుభ్రం చేస్తుండగా ల్యాప్‌టాప్‌ను గమనించి వెంటనే పోలీసులకు అప్పగించాడు. కాగా శనివారం పోలీసులు ల్యాప్‌టాప్‌ను వైభవ్‌కు అప్పగించారు. ఆటోడ్రైవర్ నిజాయితీని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ప్రశంసించారు.

616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles