హెచ్‌ఎండీఏ ప్లాట్ల ఈ-వేలం తేదీల్లో స్వల్ప మార్పు

Wed,September 26, 2018 06:59 AM

hmda plots e-auction  dates changed

హైద‌రాబాద్‌: హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండో విడత చేపడుతున్న ప్లాట్ల ఈవేలం ప్రక్రియకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో 67 ప్లాట్లు, ఇతర లే అవుట్లలో 28 ప్లాట్లు కలిపి 95 ప్లాట్లను ఈ యాక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లాట్ల ఈ -వేలంలో పేరు నమోదు చేసుకునేందుకు కొనుగోలుదారులు పోటీపడ్డారు.

500 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, నిర్ణీత వ్యవధిలో ఈఎండీ 300 మంది మాత్రమే చెల్లించి ఈ-వేలంలో బిడ్డరుగా అర్హత సాధించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి మూడు రోజులపాటు జరుగనున్న ఈ -వేలం నిర్వహణ తేదీల్లో స్వల్ప సవరణలు చేసినట్లు కమిషనర్ జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్ యాక్షన్ నిర్వహించే బ్యాంకుల సాంకేతిక కారణాల వల్ల ఈనెల 26, 27న జరగాల్సిన ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ వేలంను 29,30వ తేదీల్లో నిర్వహించనున్నామని వెల్లడించారు. ముందుగా పేర్కొన్న ఇతర ఇతర లేఅవుట్లలోని 37 ప్లాట్లకు సంబంధించి 28న ఆన్‌లైన్ ఈ వేలం నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. వివరాల కోసం హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని సహా య కేంద్రంలో కానీ www.hmda. gov.inలో www.hmda. auctiontiger.net వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

1979
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles