టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Sat,January 12, 2019 07:28 PM

Heavy Rush at Railway Stations, Bus Stations Due to Sankranti Festival

హైద‌రాబాద్: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో రహదారులపై రద్దీ కనిపిస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద అక్క‌డ‌క్క‌డా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫెస్టివ‌ల్‌కు ముందు రెండో శనివారం, ఆదివారం వ‌రుస సెలవులు కలిసి రావడంతో శుక్రవారం సాయంత్రం, శ‌నివారం ఉద‌యం నుంచే ప్రయాణికులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో న‌గ‌రంలోని ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. అలాగే ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన ప్ర‌యాణ ప్రాంగ‌ణాలు ర‌ద్దీగా ఉన్నాయి.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్‌ ఛార్జీలు చెల్లించేందుకు వాహనదారులు గంటల కొద్ది వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.


సంక్రాంతి పండుగ సందర్భంగా 5,252 ప్రత్యేక బస్సులను వివిధ రూట్లలో 11 నుంచి 16 వరకు నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎంపికచేసిన ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాల వైపు ప్రతిరోజూ వెళ్లే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

2529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles