భాగ్యనగరంలో భారీ వర్షం



Sat,August 12, 2017 06:53 PM
భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉన్నట్టుండి శనివారం సాయంత్రం వర్షం నగరాన్ని ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, చందానగర్, మాసాబ్ ట్యాంక్, ఖైరతాబాద్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి అటు ప్రజలు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ఈదురుగాలులు కూడా వీచడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

1429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS