హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Tue,May 21, 2019 08:16 PM

Heavy rain in Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం పడుతుంది. అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సోమాజిగూడ, కూకట్‌పల్లి, జీడీమెట్ల, సూరారం, దూలపల్లి, చింతల్, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రిలీఫ్ టీంలనను అలర్ట్ చేసింది. ఉప్పల్, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట, సికింద్రాబాద్, కీసర మండలం నాగారంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

4936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles