అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి!

Sun,January 13, 2019 08:10 AM

Hawk Eye helps track lost mobiles

హైద‌రాబాద్‌: ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్ పోలీస్ మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులు.... హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పనులకు హ్యాట్సాఫ్ అంటూ హైదరాబాద్‌ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌లో వివిధ రకాలైన ఫీచర్లు ఉన్నాయి. అందులో సెకెండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసేవారు, సెల్‌ఫోన్ కొనేముందు హాక్ ఐ అప్లికేషన్‌లో ఐఎంఈఐ నెంబర్లను చూసుకోవచ్చు. దొంగతనం అయినా, మిస్సింగ్ అయిన సెల్‌ఫోన్లకు సంబంధించి ఐఎంఈఐ నంబర్లతో కూడిన డేటాబేస్ ఉంటుందని సీపీ వివరించారు.

‘హాక్ ఐ అప్లికేషన్’ ఫీచర్లు

దీంతో కొనబోతున్నది దొంగిలించిందా? కాదా? అనే విషయం నిర్ధారణ అవుతుందన్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ కోర్ టీం, హాక్‌ఐకి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్ల ఫిర్యాదులపై స్పందించిన ఐటీ విభాగం ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా 24 సెల్‌ఫోన్లను రికవరీ చేసిందన్నారు. సుమారు 9 లక్షల మంది సెల్‌ఫోన్లలో హాక్ ఐ అప్లికేషన్ ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని సీపీ సూచించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఠాణాలో సీసీ కెమెరాల వీక్షణ సెంటర్..

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ, నేను సైతం కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 2.5 లక్షలకుపైగా సీసీ కెమెరాలున్నాయని సీపీ తెలిపారు. సీసీ కెమెరాలను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షించడం కష్టంగా ఉంటుందన్నారు. అందుకే సీసీ కెమెరాల వీక్షణ, పరిశీలనకు సంబంధించిన అంశాలను వికేంద్రీకరిస్తూ ప్రతి ఠాణాలో వీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 34 పోలీస్‌స్టేషన్లలో పీఎస్ వ్యూహింగ్ సెంటర్స్(ఠాణా వీక్షణ సెంటర్)లు సిద్ధమయ్యాయని, రెండున్నర నెలల్లో మిగతా 26 పోలీస్‌స్టేషన్లలోను పూర్తవుతాయని సీపీ వివరించారు. హైదరాబాద్‌ను క్రైమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి నేను సైతం కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు సహకరించాలని సీపీ కోరారు.

3967
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles