గవర్నర్ స్పీచ్ అక్షర సత్యం : సీఎం కేసీఆర్

Wed,March 14, 2018 01:59 PM

governor speech 100 percent correct says cm kcr

హైదరాబాద్ : శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్పీచ్ విషయంలో ప్రతిపక్ష సభ్యులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయమేమంటే.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే చదవాలి. గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదవుతారు. ప్రభుత్వంలో జరిగే సత్యాలనే గవర్నర్ చదవి వినిపించారు. ప్రభుత్వం సాధించుకున్న లక్ష్యాలను.. నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ సభలో చదవి వినిపించారు. ఈ మధ్య కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘటలను బాధను కలిగిస్తున్నాయని తెలిపారు. సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సీఎం అన్నారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles