ఒక్క బుల్లెట్‌ కూడా ఉపయోగించొద్దని చెప్పా!

Tue,September 3, 2019 04:46 PM

Governor Narasimhan   Holds Press Meet at Raj bhavan

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమైందని, తొమ్మిదిన్నరేళ్లుగా సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మీడియాతో గవర్నర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ''ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయి. రాష్ట్ర విభజన సమయంలో నేను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారు. గవర్నర్‌గా ఎంతో నేర్చుకున్నా. కర్ఫ్యూ సమయంలో ఈ గడ్డపై కాలు మోపా. ఉద్యమ సమయంలో పోలీసులు సంయమనం పాటించారు. తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టా. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన అనుకున్నారు. ఒక్క బుల్లెట్‌ కూడా ఉపయోగించొద్దని ఉద్యమ సమయంలో చెప్పా. నేను ఏ పార్టీకి, వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించలేదు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు. ఎప్పుడూ దేవాలయాలను దర్శించడానికి వెళ్తారంటూ నాపై చేసిన ఆరోపణలు బాధించాయి. నేను తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాలకే వెళ్లాను. ప్రతిరోజూ హైదరాబాద్‌లోని ఆలయానికి వెళ్తాను. నాకు కూడా ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఇకపై సామాన్యుడిలా జీవితం గడుపుతా. చెన్నైలోనే స్థిరపడతా.'' అని గవర్నర్‌ పేర్కొన్నారు.

2897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles