'వీఆర్‌ వన్‌ రన్‌' ప‌రుగు ప్రారంభించిన గవర్నర్‌

Sun,March 17, 2019 12:42 PM

Governor ESL Narasimhan  flags off V R 1 Run on Sunday

హైదరాబాద్‌: మహిళల భద్రత కోసం మహిళలతో పాటు పురుషులు కూడా ఏకం కావాలనే నినాదంతో 'వీఆర్‌ వన్‌ రన్‌' పేరుతో ప్రత్యేక పరుగు నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్‌లో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో మూడు రకాల రన్‌లు 10కే, 5కే, 2కే పరుగు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ నరసింహన్‌.. రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. నెక్టెస్‌ రోడ్డు.. ఎన్టీఆర్‌ ఘాట్‌ మార్గంలో పరుగు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఎస్కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌, సినీ నటులు పూజా హేగ్డే, నిహారిక తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్‌ చేసుకున్న వారికి రేస్‌కిట్‌లో భాగంగా టీషర్ట్‌, పుస్తకాలు, సీడీలు అందించారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టారు. షీటీం తరపున వీఆర్‌1 (అందరం ఒకటే), మెన్‌ స్టాండింగ్‌ ఫర్‌ ఉమెన్‌ (మహిళల భద్రత కోసం పురుషులు) అనే నినాదాలతో ఈ రన్‌ నిర్వహించారు.

782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles