HomeLATEST NEWSGovernment Chief Whip, Whips Announced by CM KCR

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

Published: Sat,September 7, 2019 07:47 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌, విప్‌లుగా గొంగిడి సునీత, గంపా గోవర్ధన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్‌లను ముఖ్యమంత్రి నియమించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించిన రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నది.
5873
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology